PM Modi-Friedrich Merz: గుజరాత్ సంస్కృతికి చిహ్నంగా నిలిచే అంతర్జాతీయ గాలిపటాల పండుగ అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీ తీరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. రంగురంగుల గాలిపటాలతో ఆకాశం ఒక అద్భుతమైన కాన్వాస్‌లా మారిపోయింది. ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఇద్దరు ప్రపంచ నేతలు చిన్నపిల్లల్లా ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేయడం అక్కడికి వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకుంది.
గాంధీజీకి నివాళులు.. ద్వైపాక్షిక చర్చలు
వేడుకల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ, ఛాన్సలర్ మెర్జ్ కలిసి చారిత్రక సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. భారత స్వాతంత్ర్య పోరాటానికి కేంద్ర బిందువైన ఆశ్రమంలో మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రివర్‌ఫ్రంట్‌కు చేరుకున్న నేతలు, గాలిపటాల తయారీలో నిమగ్నమైన మహిళా కళాకారులతో ముచ్చటించారు. గాలిపటాల తయారీ వెనుక ఉన్న నైపుణ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలపై గాంధీనగర్‌లో కీలక సమావేశాలు కూడా జరగనున్నాయి.
రికార్డు స్థాయిలో పర్యాటకులు
ఈ ఏడాది గాలిపటాల పండుగ సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుండి 135 మంది నిపుణులైన క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వచ్చారు. అలాగే దేశం నలుమూలల నుండి వెయ్యి మందికి పైగా పతంగి ప్రేమికులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. గతేడాది దాదాపు 3.8 లక్షల మంది సందర్శకులు రాగా, ఈసారి ఆ సంఖ్య 5 లక్షలు దాటుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ గుర్తుగా ఎగురవేసిన ప్రత్యేక గాలిపటం ఈ వేడుకల్లో హైలైట్‌గా నిలిచింది.
పర్యాటక రంగానికి కొత్త ఊపు
ఈ ఉత్సవాల ద్వారా గుజరాత్ పర్యాటక రంగం ప్రపంచస్థాయి గుర్తింపును పొందుతోంది. కేవలం అహ్మదాబాద్‌లోనే కాకుండా రాజ్ కోట్, సూరత్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ వంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, సంస్కృతి ప్రపంచానికి పరిచయం అవుతున్నాయి. అంతర్జాతీయ నాయకుల రాకతో ఈ పండుగ ఖ్యాతి మరింత పెరిగింది. జనవరి 14వ తేదీ వరకు ఈ గాలిపటాల సందడి నిరంతరాయంగా కొనసాగనుంది.
#WATCH | Ahmedabad, Gujarat: Prime Minister Narendra Modi and German Chancellor Friedrich Merz attend International Kite Festival 2026 at Sabarmati Riverfront.
(Source: DD News) pic.twitter.com/n611NrLIOl
— ANI (@ANI) January 12, 2026
Welcome to India! Willkommen in Indien!
Federal Chancellor Friedrich Merz @Bundeskanzler has arrived in Ahmedabad on an official visit. Warmly received by Hon’ble Governor of Gujarat, Shri Acharya Devvrat at the airport.
India and Germany are celebrating 75 years of… pic.twitter.com/Qw4ZkQ0FpP
— Randhir Jaiswal (@MEAIndia) January 12, 2026
PM Narendra Modi tweets, “Sabarmati Ashram stands as a powerful reminder of Mahatma Gandhi’s ideals which have given strength to countless people around the world. In Ahmedabad this morning, went to Sabarmati Ashram with the Chancellor of Germany, Mr Friedrich Merz.” pic.twitter.com/VMRfV7MWCx
— ANI (@ANI) January 12, 2026
