ఇది యుద్ధాల యుగం కాదు: ప్రధాని మోడీ

లావోస్: సముద్ర కార్యకలాపాల కోసం నావిగేషన్, ఎయిర్ స్పేస్ స్వేచ్ఛను నిర్ధారించడం అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లావోస్ లో జరిగిన 19వ ఈస్ట్ ఆసియా సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. సముద్ర కార్యకలాపాలు ఐక్యరాజ్యసమితి చట్టాలకు లోబడి జరగాలని అన్నారు. అభివృద్ధి కోసం స్వేచ్ఛ, బహిరంగ, సమ్మిళిత, శ్రేయస్సు, నియమాలతో కూడిన ఇండో పసిఫిక్ రీజియన్ ముఖ్యమన్నారు.

ఇటీవల యాగి తుఫాను కారణంగా మరణం సంభవించడం పట్ల విచారం వ్యక్తం చేశారు.ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు గ్లోబల్‌ సౌత్‌ దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని మోడీ అన్నారు. ‘నేను బుద్ధుడి బోధనలను అనుసరించే దేశం నుంచి వచ్చాను. ఇది యుద్ధాల యుగం కాదు.. యుద్ధంతో సమస్యలకు పరిష్కారాలు దొరకవు’ అని చెప్పుకొచ్చారు.

పశ్చిమాసియాల్లో శాంతి స్థిరత్వం పునరుద్ధరించాలని ప్రధాని మోడీ తెలిపారు. ఇక, ప్రపంచ శాంతి భద్రతకు ఉగ్రవాదం పెను సవాలుగా మారిందన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు మానవత్వంపై విశ్వాసమున్న శక్తులన్నీ కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Manipur: మణిపూర్ లో తెరుచుకోనున్న విద్యాసంస్థలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *