Pm modi: హర్యానాలో నిర్వహించిన ఒక సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదాన్ని ప్రస్తావిస్తూ, అడవులపై బుల్డోజర్లు పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలై ఉందని ఆరోపించారు. ఇది ప్రకృతిని నాశనం చేయడమే కాకుండా, వన్యప్రాణులకు కూడా హానికరమని అన్నారు.ఈ సందర్భంగా, ప్రధాని మోదీ హర్యానాలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు.
కాంగ్రెస్ పాలనలో ప్రకృతి విధ్వంసం ఓ సాధారణ విషయమైపోయిందని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం మర్చిపోయిందని, ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అటవీ సంపదను నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని మోదీ వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు.

