Pm modi: ఢిల్లీలో జరిగిన ఎన్నికల విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. “ఢిల్లీ ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. సుపరిపాలనకు, అభివృద్ధికి ప్రజలు మద్దతు ఇచ్చారు. ఢిల్లీ అభివృద్ధికి గ్యారెంటీ ఇస్తున్నా” అని ప్రధాని మోడీ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ విజయాన్ని పార్టీ శ్రేణులకు పెద్ద ప్రోత్సాహకంగా పేర్కొంటూ, భవిష్యత్తులో మరింత ప్రజా రంజకమైన పాలన ఉంటుందని పురంధేశ్వరి హామీ ఇచ్చారు.
పురంధేశ్వరి వ్యాఖ్యలు:
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మాట్లాడుతూ, “ఈ విజయం పార్టీ శ్రేణులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. బీజేపీ నాయకత్వంలో ఢిల్లీలో ప్రజా రంజకమైన పాలన అందుబాటులోకి రానుంది” అని తెలిపారు.
చంద్రబాబు వ్యాఖ్యలు..
ఢిల్లీలో ఎన్డీఏ విజయం చరిత్రాత్మకం-చంద్రబాబు వాయు కాలుష్యంతో పాటు.. రాజకీయ కాలుష్యంతో ఢిల్లీ వాతావరణం చెడిపోయింది చాలా మంది ఇతర నగరాలకు వెళ్లిపోయారు మోదీపై నమ్మకంతోనే బీజేపీని గెలిపించారు అని చంద్రబాబు అన్నారు.

