Pm Modi: డ‌బుల్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో భార‌త్‌కు అడ్వాంటేజ్

డ‌బుల్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో భార‌త్‌కు అడ్వాంటేజ్ జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న ప్ర‌పంచానికి భార‌త్ ఆశను క‌ల్పిస్తోంద‌ని చెప్పారు. ఢిల్లీలో ఎన్డీటీవీ నిర్వ‌హిస్తున్న స‌ద‌స్సులో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర‌జాస్వామ్య విలువ‌లు, డిజిట‌ల్ ఇన్నోవేష‌న్‌.. స‌హ‌జీవ‌నం చేయ‌గ‌ల‌వ‌ని భార‌త్ నిరూపించిన‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. టెక్నాల‌జీతో స‌మ‌గ్ర‌త సాధించాల‌ని, కానీ దాన్ని నియంత్ర‌ణ‌కు, విభ‌జ‌న‌కు వాడ‌రాద‌న్న ఉద్దేశాన్ని భార‌త్ చూపించిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు.

మూడ‌వ సారి తాము అధికారంలోకి రావ‌డం వ‌ల్ల భార‌త వృద్ధి రేటు వేగంగా జ‌రుగుతున్న‌ట్లు అనేక సంస్థ‌లు అంచ‌నా వేశాయ‌న్నారు. త‌మ ప్ర‌భుత్వానికి రెస్ట్ అనేది లేద‌ని, భార‌త దేశ క‌ల‌ల‌ను నిజం చేసే వ‌ర‌కు విశ్ర‌మించ‌బోమ‌న్నారు., ఏఐ టెక్నాల‌జీతో పాటు ఆస్పిరేష‌న‌ల్ ఇండియాగా దేశం మారుతోంద‌న్నారు. దేశ ప్ర‌జ‌లు విక‌సిత్ భార‌త్ గురించి చ‌ర్చిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. జ‌న శ‌క్తితో రాష్ట్ర శ‌క్తి సాధిస్తున్న‌ట్లు ఉంద‌న్నారు. ఊహాజ‌నితంగా సంబంధాల‌ను పెంచుకోబోమ‌ని, త‌మ బంధాల‌న్నీ న‌మ్మ‌కం, విశ్వాసం మీద ఆధార‌ప‌డి ఉంటాయ‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *