PM KISON:

PM KISON: పీఎం కిసాన్ న‌గ‌దుసాయంపై కీల‌క అప్‌డేట్‌!

PM KISON:పీఎం కిసాన్ న‌గ‌దు సాయం కోసం దేశవ్యాప్తంగా అన్న‌దాత‌లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే 21వ విడ‌త నిధుల‌ను ప్ర‌ధాని మోదీ త‌మిళ‌నాడు వేదిక‌గా విడుద‌ల చేశారు. 22వ విడ‌త విడ‌త సాయం కోసం ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఈ జ‌న‌వ‌రి నెల‌లోనే ఈ విడ‌త సాయం అందుతుంద‌ని భావించారు. కానీ, రైతుల‌కు నిరాశే మిగిలింది. కానీ, తాజాగా పీఎం కిసాన్ 22వ విడ‌త న‌గదు సాయం విడుద‌ల‌పై కీల‌క స‌మాచారం అందింది.

PM KISON:ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ర‌బీ సాగు మొద‌లై నెల కావ‌స్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ది. ఈ బ‌డ్జెట్‌లోనే పీఎం కిసాన్ ప‌థ‌కాన్ని నిధులు కేటాయించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది. నిధుల విడుద‌లపై చ‌ర్చ జ‌ర‌గ‌డంతోపాటు పెంపుద‌ల పైనా చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని భావిస్తున్నారు. సానుకూలంగా జ‌రిగితే ఫిబ్ర‌వ‌రి నెల మొద‌టి వారంలోనే 22వ విడ‌త పీఎం కిసాన్ న‌గ‌దు సాయం అందుతుంద‌ని భావిస్తున్నారు.

PM KISON:ఇదిలా ఉండ‌గా, రెండు తెలుగు రాష్ట్రాల రైతుల‌కు ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాల ఒక‌వేళ ఇస్తే అద‌న‌పు న‌గ‌దు సాయం అంద‌నున్న‌ది. దీంతో రైతుల‌కు మ‌రింత మేలు చేకూరనున్న‌ది. తెలంగాణ నుంచి రైతు భ‌రోసా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాల ద్వారా ఆ సాయం అంద‌నున్న‌ది. పీఎం కిసాన్ 2,000 సాయంతోపాటు ఏపీలో రూ.4 వేలు, తెలంగాణ‌లో ఎక‌రాకు 5,000 అంద‌నున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *