PM Kisan yojana: దేశవ్యాప్తంగా అన్నదాతలకు మరో కీలక సమాచారం అందింది. పీఎం కిసాన్ 22వ విడత నగదు సాయం అందేదెప్పుడు? ఇప్పుడున్న నగదుసాయమే అందుతుందా? లేక పెంచుతుందా? అన్న కీలక అంశాలపై రైతులకు శుభవార్తే దక్కే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఇప్పటి వరకు ఏటా మూడు విడతలుగా మొత్తం.. 21 విడతలుగా కేంద్రం నగదు సాయాన్ని అందజేస్తూ వచ్చింది. ఏటా 6,000 చొప్పున విడతకు 2,000గా అందజేస్తూ రైతులకు ఆసరాగా నిలుస్తున్నది.
PM Kisan yojana: త్వరలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడి అధికార పార్టీలను ఓడించి తీరాలనే పట్టుదలతో ఉన్నది. ఇందు కోసం ఎంతకైనా వెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన పీఎం కిసాన్‌నే ఆయుధంగా చేసుకుంటుందని వారు విశ్లేసిస్తున్నారు.
PM Kisan yojana: ఇప్పుడు ఏటా ఇస్తున్న రూ.6,000 నగదు సాయాన్ని రూ.8,000కు పెంచే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఈ మేరకు కేంద్రం నుంచి సూచనలు అందినట్టు విశ్లేషకుల అంచనా. ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశంతోపాటు రైతుల ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ఖర్చులు పెరగడంతో ఆధునిక సాంకేతిక అవసరాల వాడకంతో రైతులకు మరింతగా పెట్టుబడులు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.
PM Kisan yojana: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నది. ఈ నేథప్యంలో ఈ బడ్జెట్‌లోనే దేశవ్యాప్త రైతులకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పీఎం కిసాన్ యోజనపై శుభవార్తను అందిస్తూ రూ.8,000కు పెంచుతుందని తెలుస్తున్నది. దీంతోపాటు వివిధ రాష్ట్రాలు రైతులకు అందిస్తున్న నగదు, ఇతర సాయాన్ని పెంచుతూ వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు నగదు సాయాన్ని ఆయా ప్రభుత్వాలు పెంచాయి. కేంద్రం అందజేసే పీఎం కిసాన్ సాయాన్ని ఇంతవరకూ పెంచనందున ఈ సారి కచ్చితంగా పెంచుతుందని ఆశాభావం వ్యక్తమవుతున్నది.
