PM Kisan yojana:

PM Kisan yojana: పీఎం కిసాన్ యోజ‌న ల‌బ్ధిదారుల‌కు శుభ‌వార్త‌.. కీల‌క అప్‌డేట్‌?

PM Kisan yojana: ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వ‌చ్చాక దేశ‌వ్యాప్తంగా అమ‌లులోకి వ‌చ్చిన ప్ర‌తిష్ఠాత్మ‌క ప‌థ‌కాల్లో ప్ర‌ధాని కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న ఒక‌టి. ఇది దేశంలోని చిన్న‌, స‌న్న‌కారు రైతుల‌కు ఆర్థికంగా భ‌రోసా క‌ల్పించాల‌నే ధ్యేయంతో కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. వ్య‌వ‌సాయ సాగు ఆరంభంలో రైతుల‌కు అవ‌స‌ర‌మైన పెట్టుబ‌డికి సాయ‌ప‌డ‌టం, అప్ప‌ల భారాన్ని కొంతమేర‌కు త‌గ్గించ‌డం ఈ ప‌థ‌కం యొక్క ప్ర‌ధాన ధ్యేయం. ఈ ప‌థ‌కంలో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం అందించే ఆర్థిక సాయం న‌గ‌దు రూపంలో నేరుగా రైతుల ఖాతాల్లోనే జ‌మ‌వుతుంది.

PM Kisan yojana: ఈ పీఎం కిసాన్ యోజ‌న ప్రారంభం నాటి నుంచి అర్హులైన ప్ర‌తి రైతుకు ఏటా రూ.6,000 చొప్పున న‌గ‌దు సాయాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న‌ది. దీనిని మూడు విడ‌త‌లుగా రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జ‌మ చేస్తూ వ‌స్తున్న‌ది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫ‌ర్ (DBT) విధానంలో న‌గ‌దు జ‌మ అవుతుండ‌టంతో మ‌ధ్య‌వ‌ర్తులు ఎవ‌రూ లేకుండానే నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ‌వుతుండ‌టం ఈ ప‌థ‌కం విజ‌య‌వంతానికి కీల‌క కార‌ణం.

PM Kisan yojana: 2019లో ప్రారంభ‌మైన ఈ పీఎం కిసాన్ యోజ‌న ఏటా నిర‌భ్యంత‌రంగా కొన‌సాగుతూ వ‌స్తున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 21 విడ‌త‌లుగా రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున కేంద్ర ప్ర‌భుత్వం న‌గ‌దును జ‌మ చేస్తూ వ‌చ్చింది. ఈ సారి 22వ సారి న‌గ‌దు సాయాన్ని అంద‌జేయాల్సి ఉన్న‌ది. అయితే దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్న సాగు ఖ‌ర్చులు, ఎరువులు, విత్త‌నాలు, కూలీల ఖ‌ర్చుల‌ను దృష్టిలో ఉంచుకొని పీఎం కిసాన్ యోజ‌న న‌గ‌దు సాయాన్ని పెంచాల‌నే డిమాండ్ వినిపిస్తున్న‌ది.

PM Kisan yojana: అయితే ఈసారి కేంద్రం రైతుల డిమాండ్‌ను ఆల‌కించిన‌ట్టుగా అనిపిస్తున్న‌ది. ప్ర‌తి బ‌డ్జెట్‌లో పెంపుపై ఆశ‌తో ఉన్న రైతుల‌కు నిరాశే ఎదుర‌వుతూ వ‌స్తున్న‌ది. ఈసారి బ‌డ్జెట్‌లో క‌చ్చితంగా న‌గ‌దు సాయాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తాజా సంకేతాలు అందుతున్నాయి. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం సుముఖంగా ఉన్న‌ద‌ని వార్త‌లు అందుతున్నాయి. నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా దేశ‌వ్యాప్త రైతుల‌కు కిసాన్ యోజ‌న న‌గ‌దు సాయాన్ని ఏటా రూ.10,000కు పెంచుతుంద‌ని భావిస్తున్నారు. కొంద‌రు ఏకంగా రెట్టింపు అయి రూ.12,000కు పెరుగుతుంద‌ని చెప్తున్నారు. త్వ‌ర‌లో ఈ తీపిక‌బురు రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తుంద‌ని స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *