PM Kisan yojana:దేశవ్యాప్తంగా అన్నదాతలకు భారీ గుడ్ న్యూస్ అందింది. దేశవ్యాప్తంగా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధుల విడుదల తేదీ ఖారారైంది. దీంతో పీఎం కిసాన్ 20వ విడత నిధులను ఆగస్టు 2వ తేదీన అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి. ఇప్పటికే 19 విడతల్లో పీఎం కిసాన్ నిధులు జమయ్యాయి.
PM Kisan yojana:ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారణాసి పర్యటన ఆగస్టు 2న ఉన్నది. అదేరోజు జరిగే బహిరంగ సభలో ప్రధాని పీఎం కిసాన్ 20వ విడత నిధులను విడుదల చేస్తారని జాతీయ మీడియా కథనాల సమాచారం. గతంలో కూడా 17వ విడత పీఎం కిసాన్ నిధులను కూడా వారణాసి పర్యటన సమయంలోనే ప్రధాని మోదీ విడుదల చేయడం గమనార్హం.
PM Kisan yojana:ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద విడుదల చేసే 20వ విడత రూ.2,000 సాయంతోపాటు ఏపీ కూటమి ప్రభుత్వం అందజేయనున్న రూ.5,000 కలిపి మొత్తం రూ.7,000 నగదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల్లో జమకానున్నట్టు సమాచారం.

