PM Kisan yojana: కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది. ప్రతి ఏటా మూడు విడతల్లో రైతుకు అందించే కిసాన్ సమ్మాన్ నిధిని జూన్ నెల మూడో వారంలోనే జమ చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ప్రతి ఏటా ఎకరాకు రూ.6,000ను మూడు విడతల్లో అందజేస్తున్నది. ఈ ఏడాది తొలి విడత రూ.2,000ను గత ఫిబ్రవరి 19న రైతుల ఖాతాల్లో జమ చేసింది.
PM Kisan yojana: రెండో విడత అంటే 20వసారి కిసాన్ సమ్మాన్ నిధి సొమ్మును ఈ నెల మూడో వారంలో జమ చేయనున్నట్టు సమాచారం. ఈ కిసాన్ నిధి అందాలంటే అర్హులైన రైతులు ఈ-కేవైసీ పూర్తి చేసుకొని ఉండాలని అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా రైతులు 20వ విడత కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
PM Kisan yojana: ఇదిలా ఉండగా, ప్రతి రైతు ఫార్మర్ ఐడీ చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇది తప్పని సరి అని చెప్తున్నారు. భవిష్యత్తులో రైతు పథకాలు, ఇతర బెనిఫిట్స్ అందాలంటే ఈ ఫార్మర్ ఐడీని కేంద్రం తప్పనిసరి చేసిందని తెలుపుతున్నారు. ఇప్పటికే నుంచి శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి రైతు వివరాలు సేకరిస్తున్నారు.