PM Internship Scheme

PM Internship Scheme: PM ఇంటర్న్‌షిప్ పథకం 2025 – ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

PM Internship Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) 2025 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన ఈ పథకం ద్వారా ఐదేళ్లలో 10 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందించనున్నారు. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, 2025 మార్చి 12 వరకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పథకం కింద 300కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు, కనీసం పదో తరగతి పాసైనవారు అర్హులు. టెన్త్‌తో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి విద్యార్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల వారు, రూ. 8 లక్షలకు పైగా ఆదాయం కలిగినవారు, ఐఐటీ/ఐఐఎం విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు.

Also Read:  Viral Video: స్విమ్మింగ్ పూల్ లో పడిపోయిన 84 ఏళ్ల బామ్మ.. తర్వాత ఏంచేసిందో తెలిస్తే షాక్ అవసిందే

PM Internship Scheme: ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం శిక్షణ అందించనుండగా, ఆరు నెలలు క్లాస్‌రూమ్ శిక్షణ, మిగతా ఆరు నెలలు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. శిక్షణ కాలంలో ప్రతి నెలా రూ.5,000 స్టైఫండ్ అందించడంతో పాటు, ప్రారంభంలో రూ.6,000 వన్‌టైమ్ గ్రాంట్ కూడా ఇస్తారు. అదనంగా, ప్రభుత్వ బీమా పథకాలైన పీఎం జీవన్ జ్యోతి బీమా, పీఎం సురక్షా బీమా అందించనున్నారు, వీటి ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) 2025 అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితంగా ఉంటుంది, ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *