Pilli Sattibabu Resigns: కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు తన పదవికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయం స్థానిక రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. పదవికి గుడ్‌బై చెబుతూ, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాసి తన ఆవేదనను వ్యక్తం చేశారు.
సత్తిబాబు లేఖలో స్పష్టంగా పేర్కొన్న అంశాలు:
-
జనసేన ఎమ్మెల్యే నానాజీ వైఖరి: నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో టీడీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కార్యకర్తలు సమస్యలతో ఎమ్మెల్యే వద్దకు వెళ్లినప్పుడు, వారిని నేరుగా కలవకుండా, జనసేన మండల ప్రెసిడెంట్‌ను వెంట తీసుకురావాలని చెబుతున్నారని సత్తిబాబు లేఖలో పేర్కొన్నారు.
-
పార్టీ కోఆర్డినేటర్లు, పరిశీలకుల నిరుపయోగం: పదే పదే సమస్యలను తెలుపుతున్నా, ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు సార్లు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా, ఎలాంటి ఫలితం రాలేదని అన్నారు.
- కార్యకర్తలకు న్యాయం చేయలేకపోవడం: తాను నమ్ముకున్న కార్యకర్తలకు సరైన గుర్తింపు రాకపోతే, తన పదవి కొనసాగించడం వ్యర్థమని స్పష్టం చేశారు. అందుకే ఇకపై పార్టీ పదవుల్లో కాకుండా, సాధారణ కార్యకర్తగా పనిచేస్తానని లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Pilli Sattibabu Resigns: అందుకే రాజీనామా చేస్తున్న.. చంద్రబాబుకు పిల్లి సత్తిబాబు లేఖ
ఇక, రాజీనామా వెనుక ఉదయం జరిగిన మండలాధ్యక్షుని నియామకంపై ఘర్షణ కూడా కారణమని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామంతో కాకినాడ రూరల్ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.