Delhi వక్ఫ్ చట్టానికి సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటివరకు 70కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పరిశీలిస్తోంది.
జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులను విచారిస్తోంది. ఈ పిటిషన్లలో వక్ఫ్ చట్టం సాంస్దానిక హక్కులను కాలరాసే విధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పాటు, వక్ఫ్ బోర్డుల అధికారాలు, వాటి నిర్ణయాలు, భూముల హక్కులపై పలువురు పిటిషనర్లు ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ విచారణలో తమ వాదన కూడా వినాలని కేంద్ర ప్రభుత్వం కోర్టును కోరింది. చట్టానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలను సమర్థించేందుకు కేంద్రం సన్నద్ధంగా ఉందని తెలిపింది.
సుప్రీంకోర్టు విచారణలో ఈ అంశంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.