Delhi: టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌ను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం, మెయిన్స్ ఎంపికపై వచ్చిన అభ్యంతరాల పిటిషన్లను తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు డివిజన్ బెంచ్‌కు ఐదుగురు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారమే విచారణ జరగనున్నది. అదే విధంగా అభ్యర్థుల తరఫున లాయర్ మోహిత్ సుప్రీంకోర్టులోనూ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం రూల్ ఆఫ్ లా పాటించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానున్నది.

