Peter Navarro: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారతదేశంపై విధించిన టారిఫ్‌లు మేథోమధనానికి దారితీస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఆర్థిక వేత్తలు ఈ టారిఫ్‌లపై స్పందించగా, ఈసారి మరో అమెరికా ఆర్థికవేత్త మరో రకంగా అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ టారిఫ్‌లు తొలగకపోవడానికి భారతదేశ అధ్యక్షుడు నరేంద్ర మోదీ వైఖరే కారణమని వైట్‌హౌస్ సలహాదారు, ఆర్థికవేత్త పీటర్ నవారో పేర్కొన్నారు. మోదీ ఎందుకిలా చేస్తున్నారోనని ఆశ్చర్యం కూడా వ్యక్తంచేయడం గమనార్హం.
Peter Navarro: భారత్‌పై అమెరికా విధించిన ఆంక్షలు అమల్లోకి వచ్చిన సందర్భంగా నవారో మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకాలను తగ్గించుకునే అవకాశం ఆ దేశానికి ఉన్నదని ఆర్థికవేత్త పీటర్ నవారో తెలిపారు. రష్యా దేశం నుంచి భారతదేశం చమురు కొనుగోళ్లను నిలిపేసిన మరుసటి రోజు నుంచి అదనపు సుంకాలను రద్దు చేస్తామని ఆయన చెప్పారు.
Peter Navarro: ఇక ఈ అంశం భారత ప్రధాని మోదీ చేతుల్లోనే ఉన్నదని, మోదీ పరిణతి చెందిన నాయకుడని పొగుడుతూనే, ఆయన ఎందుకిలా చేస్తున్నారోననే అనుమానం అంతుబట్టడం లేదని నవారో విమర్శించారు. అసలు ఉక్రెయిన్‌పై రష్యా దూకుడుకు పరోక్షంగా భారత ప్రధాని మోదీయే ప్రోత్సహిస్తున్నారంటూ పీటర్ నవారో ఆక్షేపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగేందుకు భారతదేశమే కారణమని, ఇది మోదీ యుద్ధ అని కూడా నవారో ఆరోపించడం గమనార్హం.
Peter Navarro: రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ముడి చమురు వల్ల ఉక్రెయిన్‌పై దాడులు పెరుగుతున్నాయని పీటర్ నవారో మరో బాంబు పేల్చారు. భారత్‌కు అమ్ముతున్న ముడి చమురు ద్వారా సమకూరుతున్న డబ్బుతోనే రష్యా దేశం ఉక్రెయిన్‌పై రెచ్చిపోతున్నదని, ఆ దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. భారత్ సహకారంతోనే రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి నెలకొంటుందని పీటర్ నవారో అభిప్రాయడ్డారు.