Atrocity: రోజు రోజుకి మనుషుల్లో మానవత్వం మంటగలిసిందని చెప్పడానికి, కళ్లెదుటే జరిగిన ఒక దారుణ ఘటన నిదర్శనంగా నిలిచింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి, కదల్లేని స్థితిలో ఉన్న జాతీయ పక్షి నెమలి పట్ల స్థానికులు వ్యవహరించిన తీరు యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
గాయపడిన నెమలికి దక్కని రక్షణ
వివరాల్లోకి వెళితే… రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన ఒక వాహనం నెమలిని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆ పక్షి అక్కడికక్కడే కదల్లేని స్థితిలో పడిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు వెంటనే సహాయం చేసి ఉండాల్సింది. కానీ, అక్కడి పరిస్థితి అందుకు
విరుద్ధంగా మారింది.
గాయపడిన నెమలిని కాపాడటానికి బదులు, గుంపులుగా చుట్టుముట్టిన స్థానికులు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. నెమలి ఈకల కోసం కొందరు, ఉద్దేశపూర్వకంగా మరికొందరు… ఆ పక్షి మీద పడి ఒకరినొకరు కొట్టుకుంటూ ఈకలు పీకడం మొదలుపెట్టారు.
ఇది కూడా చదవండి: Mithun Reddy: కక్ష తీర్చుకోవడానికే నన్ను అరెస్ట్ చేయించారు
ఈకల దురాశకు ప్రాణం బలి
వారి అమానుష చర్యల కారణంగా, తీవ్ర వేదనకు గురైన ఆ నెమలి అదే చోట ప్రాణాలు కోల్పోయింది. జాతీయ పక్షి పట్ల ఇలాంటి దుర్మార్గమైన చర్యకు పాల్పడిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
“మనుషుల్లో కొంచం దయ కూడా లేదా? తమ కళ్లెదుటే బాధపడుతున్న ఒక మూగజీవి పట్ల ఇంతటి హింసనా?” అంటూ నెటిజన్లు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవత్వం పూర్తిగా చచ్చిపోయిందనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుందని జనాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
మరీ ఇంత దుర్మార్గమా.. జాతీయ పక్షి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది?
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నెమలిని కాపాడ్డానికి బదులు.. ఈకలు పీకిన గ్రామస్తులు
రోడ్డు దాటుతున్న క్రమంలో.. ఒక వాహనం బలంగా ఢీకొనడం వల్ల గాయపడిన నెమలి
కదల్లేని స్థితిలో ఉండగా.. దాన్ని కాపాడ్డానికి బదులు దారుణంగా… pic.twitter.com/KBiSV1qMXo
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 1, 2025