Murder Plan: ట్రెండ్ సెట్ చేసిన మహిళా.. పెళ్లికి ముందే భర్త పై మర్డర్ ప్లాన్

Murder Plan: ఇన్ని రోజులు పెళ్లైన తర్వాతే ప్రేమించిన అబ్బాయితో కలిసి భర్తలను హతమార్చడం చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చారు కొందరు మహిళలు. పెళ్లి తర్వాత ఎందుకు? పెళ్లికి ముందే చంపేస్తే అయిపోతుంది కదా అనే ఆలోచన మొదలయింది. దానిలో భాగమే ఈ వార్త..

తెల్లారితే పెళ్లి.. ముందురోజు నైట్ రిసెప్షన్ ఉండటంతో పెళ్లికొడుకు ఎంతో ఆనందంగా తన కారులో బయలుదేరాడు. కొంత దూరం వెళ్లగానే అతడిని ఇంకో కారు వెంబడించి, వాళ్ల కారును అడ్డగించి పెళ్లికొడుకుపై కత్తులతో దాడికి దిగారు. ఎందుకు వచ్చారో, ఎందుకు కత్తులతో పొడుస్తున్నారో తెలియదు. దాడి తర్వాత దుండగులు వెళ్లిపోయారు. రక్తపు మడుగులో ఉన్న పెళ్లికొడుకును పక్కనే ఉన్న కొళ్లేగాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, పెళ్లికూతురు హాస్పిటల్ కి చేరుకున్నారు. అక్కడ పెళ్లికూతురు గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఇదంతా చూస్తున్న పోలీసులకు అనుమానం రావడంతో కూపీ లాగితే అసలు విషయం బయటపడింది. ఆమె ఈ మర్డర్ ప్లాన్ చేసినట్టు తేలింది.

పెళ్లికొడుకు రవీశ్‌ (34) పై దాడి ఘటనలో కాబోయే భార్య, ఆమె ప్రియుడు దర్శన్, 17 ఏళ్ల బాలుడిని కొళ్లేగాల పట్టణ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గోకుల్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ప్లాన్ ప్రకారం పెళ్లికొడుకు గత వారం రిసెప్షన్ కి వస్తున్న సమయంలో ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. సమయానికి రవీశ్‌ను హాస్పిటల్ లో చేర్చడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. హాస్పిటల్ లో ఉన్న సమయంలో పెళ్లికూతురు చేసిన డ్రామా మాటల్లో చెప్పలేం. “నువ్వు త్వరగా కోలుకొని నిన్నే పెళ్లి చేసుకోవాలి, లేకుంటే నేను చచ్చిపోతా” అంటూ దొంగ మాటలు చెప్పింది. ఈ అతి వేషాలే పోలీసులకు అనుమానం వచ్చేలా చేశాయి.

ఆ సమయంలో పెళ్లికొడుకు “ఈ కాలంలో కూడా ఇంతగా ప్రేమించే భార్య దొరకడం ఎంత అదృష్టమో” అనుకున్నాడు. విషయం తెలిసిన తర్వాత పెళ్లికి ముందే ఆమె నిజస్వరూపం తెలిసింది. లేకుంటే పెళ్లి తర్వాత ఒక్కడినే ఉన్న సమయంలో చంపేసేది అనుకున్నాడు.

ఆమె పైన అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను విచారించగా మర్డర్ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. జనవరి 23న రిసెప్షన్, 30న పెళ్లి నిర్ణయించారు. పెళ్లికొడుకు రవీశ్‌ ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగి. దర్శన్‌ ఆ ఊళ్లో డప్పు కొట్టే వ్యక్తి అని పోలీసులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *