Peddi Update: రామ్ చరణ్ ఇప్పుడు ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా హైప్ పెంచే విషయం ఒకటి బయటికి వచ్చింది.
రామ్ చరణ్, జాన్వీ కపూర్‌తో నెక్స్ట్ షెడ్యూల్‌లో ఒక సాంగ్ షూట్ చేయనున్నారు. ఈ సాంగ్‌లో రామ్ చరణ్ డాన్స్ మూవ్స్‌తో పాటుగా జాన్వీ కపూర్ గ్లామర్ డోస్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనున్నాయి. ఈ సాంగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఒక సెట్ వేసి అందులో షూట్ చేయనున్నారు.
ఈ సినిమా విషయానికి వస్తే, ‘పెద్ది’లో రామ్ చరణ్ ఇప్పటివరకు చేయని విధంగా తన క్యారెక్టర్ ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇందులో ఎమోషన్స్ భిన్నంగా ఉంటాయని. క్యారెక్టర్ల మధ్య ఘర్షణ కొత్తగా ఉంటూనే కథలో యాక్షన్‌ను తీసుకొచ్చే విధానం ఇప్పటివరకు చూడని విధంగా భిన్నంగా ఉంటుంది అని టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం బుచ్చి బాబు తన ప్రాణం పెట్టేసాడు అని చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి: Ayyappa Deeksha: అయ్యప్ప దీక్షలో ‘ఏకభుక్తం’: అర్థం, ఆంతర్యం ఏమిటి?
ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేంద్ర శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా అనౌన్స్ చేసినప్పుడు అందరికీ ఒక్కటే డౌట్ వచ్చింది – మ్యూజిక్ సరిగా ఇవ్వగలడా అని? దానికి కూడా కారణాలు లేకుండా పోలేదు. గత కొంతకాలంగా తన మ్యూజిక్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయలేకపోవడమే దీనికి కారణం. ఎప్పుడైతే ‘పెద్ది’ సినిమా నుండి ‘చికిరి చికిరి’ లిరికల్ సాంగ్ వచ్చి ఇన్‌స్టంట్‌గా హిట్ అయ్యిందో, అప్పటినుండి రామ్ చరణ్ అభిమానులు నెక్స్ట్ వచ్చే సాంగ్‌పై ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో రిలీజ్ కానుంది.

