Peddi Glimpse Update

Peddi Glimpse Update: పెద్ది గ్లింప్స్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అప్పుడే రిలీజ్

Peddi Glimpse Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం “పెద్ది” గురించి తాజా అప్‌డేట్స్ వైరల్ అవుతున్నాయి. “గేమ్ ఛేంజర్” నిరాశపరిచినా, ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను అలరించగా, ఇప్పుడు సినిమా గ్లింప్స్ పై హైప్ పెరిగిపోతోంది.రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ కావాల్సి ఉండగా, కొన్ని టెక్నికల్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. తాజా బజ్ ప్రకారం, ఈ గ్లింప్స్ ఉగాది స్పెషల్‌గా రిలీజ్ కానుందని టాక్. అయితే, ఈ గ్లింప్స్‌లో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఉంటుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు రిలీజ్ డేట్‌ను గ్లింప్స్‌లోనే వెల్లడించే ఛాన్స్ ఉందట. ఇది నిజమవుతుందో లేదో చూడాలి. రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఈ గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. “పెద్ది” సినిమా మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందా? ఉగాది రోజు వచ్చే అప్‌డేట్‌తో అన్నీ క్లారిటీ అయ్యే అవకాశం ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *