Payal Rajput: టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం ఎదురైంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన జులై 28న మరణించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పాయల్ రాజ్‌పుత్ ఆలస్యంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన తండ్రి అన్నవాహిక క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆయన చికిత్స పొందుతున్నారని గతంలో ఆమె అభిమానులతో పంచుకున్నారు.
తండ్రి మరణంపై పాయల్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన తండ్రిని కాపాడుకునేందుకు తాను చేయాల్సినవన్నీ చేశానని, కానీ ఆ పోరాటంలో విజయం సాధించలేకపోయానని ఆమె పేర్కొన్నారు. “క్షమించండి నాన్న” అంటూ ఆమె ఒక హృదయవిదారక పోస్ట్ చేశారు. పాయల్ రాజ్‌పుత్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు మెసేజ్‌లు పెడుతున్నారు. హీరోయిన్ లక్ష్మిరాయ్, నిర్మాత ఎస్‌కేఎన్ వంటి వారు ఆమెకు సానుభూతి తెలుపుతూ పోస్ట్‌లు పెట్టారు.
ఇది కూడా చదవండి: Akshay Kumar: ఖిలాడి క్రేజీ బిజినెస్.. కోట్లలో లాభాలు!
ఇలాంటి సమయంలో మరింత బలంగా ఉండాలని కోరారు. 2017లో పంజాబీ చిత్రం ‘చన్నా మేరియా’తో తెరంగేట్రం చేశారు పాయల్ రాజ్‌పుత్. తెలుగులో ఆమె ‘RX 100’ (2018) చిత్రంతో మంచి గుర్తింపు పొందారు, ఇందులో ఆమె బోల్డ్ పాత్రలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో పాటు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమె ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా, మంగళవారం’ వంటి పలు చిత్రాల్లో నటించారు.పాయల్ రాజ్‌పుత్ తన నటనతో పాటు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలను, సినిమా అప్‌డేట్‌లను తరచుగా పంచుకుంటారు.