Payal rajput: సెక్స్ ఎడ్యుకేషన్‌ను స్కూల్ స్థాయి నుంచే అందించాలి. లేదంటే చాలా అపోహలు, తప్పు అర్థాలు ఏర్పడతాయి. ఇది హెల్తీ రిలేషన్షిప్‌కి కూడా చాలా అవసరం” అని పాయల్ రాజ్‌పుత్ స్పష్టం చేసింది.
అలాగే తనపై వచ్చే విమర్శల గురించి మాట్లాడుతూ – “నేను నా పాత్రను నిజాయితీగా పోషిస్తాను. స్క్రీన్‌పై బోల్డ్‌గా కనిపించడమే నా వ్యక్తిత్వం కాదు. నా రోల్‌కు అవసరమైతే నేను వెనకడుగు వేయను. నన్ను బోల్డ్ సీన్స్‌కి మాత్రమే పరిమితం చేయడం తప్పు. నాలోని నటనను కూడా గుర్తించాలి” అని చెప్పింది.
సినిమా ఇండస్ట్రీలో మహిళలు తమ అభిప్రాయాలను ఓపెన్‌గా చెప్పగానే వివాదాలు వస్తాయని, అయితే తాను వెనక్కి తగ్గే ఆలోచన లేదని పాయల్ స్పష్టం చేసింది. “నేను ఎవరి అభిరుచికి బానిసను కాను. నా దారినే నడుస్తాను” అంటూ తన కాన్ఫిడెంట్ అటిట్యూడ్‌ను మరోసారి చూపించింది.

