Pawan Kalyan

Pawan Kalyan: గ్రామీణ ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ కళ్యాణ్ విజన్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పల్లెల ప్రగతి కోసం తాను ఎంచుకున్న పంచాయతీ రాజ్ శాఖలో సమర్థులు, ప్రతిభావంతులైన ఉద్యోగులనే ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు. గ్రామాలు స్వయంప్రతిపత్తితో ఎదగాలని, వాటి అభివృద్ధికి నిధులను పారదర్శకంగా వినియోగించాలని ఆకాంక్షించారు.

తన శాఖలో పోస్టింగుల కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల నుండి సిఫార్సులు వస్తున్నాయనీ, తాను మాత్రం సమర్థులైతేనే తన శాఖలో అవకాశం ఇస్తానని తేల్చి చెప్పారు. గత పది నెలల్లో పంచాయతీ రాజ్ శాఖ గణనీయ పురోగతి సాధించిందని, గత ఐదేళ్ల పాలనతో పోలిస్తే ఈ మార్పు స్పష్టమని అన్నారు. పాలనా అనుభవం లేకపోయినా, చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, చిన్న పైరవీలకు కూడా తన వద్ద తావు లేదని నిర్మొహమాటంగా చెప్పారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.

గ్రామీణాభివృద్ధిలో రాజకీయ జోక్యం లేకుండా చూస్తున్నామని, 70 నుంచి 80% వైసీపీ సర్పంచులున్న గ్రామాలనూ సమానంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు పవన్‌. తనకు పాలనలో పూర్తి స్థాయి అనుభవం లేని విషయాన్ని కూడా ఆయన బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. నాయకుల్లో ఈ లక్షణం చాలా అరుదుగా చూస్తాం. పల్లెల పట్ల తనకున్న మమకారంతో పంచాయతీ రాజ్‌ శాఖను ఎంచుకున్నానని, రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్నానని, అందువల్లే ఈ స్థాయి విజయాలు సాధ్యమవుతున్నాయని స్పష్టం చేశారు.

Also Read: Vidadala Rajini: విడదల అవినీతికి ఏసీబీ చెక్..అరెస్ట్ కు రంగం సిద్ధం.!

Pawan Kalyan: ఇలా పవన్ గ్రామీణ రాజకీయాలపై దృష్టి సారించడం వల్ల, ఇటు పల్లెలు లబ్ది పొందుతున్నాయి.. అటు జనసేన కూడా బలపడుతోందని విశ్లేషకులంటున్నారు. పల్లెలకు రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనలో పవన్ చొరవతో గ్రామీణ స్థాయిలో ఆయన ఇమేజ్ భారీగా పెరిగింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కూటమిగా రికార్డు విజయం సాధించిన పవన్, డిప్యూటీ సీఎంగా పల్లె ప్రగతికి కృషి చేస్తూ జనసేనకు కొత్త గుర్తింపు తెచ్చిపెడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Janasena: వైసీపీ నేతలు జంప్ జనసేనలో ఎంట్రీ దొరుకుంతుందా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *