Pawan Kalyan:భారత సరిహద్దు పోరులో అసువులు బాసిన వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఆర్థికసాయం ప్రకటించింది. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు మంత్రి లోక్‌ష్ కలిసి వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మురళీనాయక్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మురళీనాయక్ సేవలకు ప్రభుత్వం తగిన విధంగా గౌరవిస్తుందని ఆ ఊరి ప్రజలకు కూడా పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
Pawan Kalyan:వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ తరఫున రూ.50 లక్షల ఆర్థికసాయం ఇస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలంతోపాటు మురళి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
Pawan Kalyan: మురళీనాయక్ స్మారక చిహ్మం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో మురళి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతోపాటు తన వ్యక్తిగతంగా మురళీనాయక్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం చేస్తానని పవన్ కల్యాన్ హామీ ఇచ్చారు. ఈ కష్టకాలంలో మురళీనాయక్ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. బాధిత కుటుంబానికి ఏ సాయం కావాలన్నా చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు.
