Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రానున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా పూర్తి అవుతోంది. ఇది వారి రెండో కాంబినేషన్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు.
Also Read: The Luck: ది లక్: సామాన్యుల కోసం సరికొత్త రియాలిటీ షో!
పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ తీస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. సెట్స్‌పై టీమ్ ఫుల్ స్పీడ్‌గా పని చేస్తోంది. వీరి కాంబోలో ‘గబ్బర్ సింగ్’ తర్వాత రాబోతున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయి. ఇటీవల సెప్టెంబర్ 6న మళ్లీ షూటింగ్ రీస్టార్ట్ చేసిన యూనిట్, పవన్‌తో కలిసి కీలక గ్రాండ్ సాంగ్ సీక్వెన్స్‌ను స్టార్ట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ట్రేడ్‌మార్క్ బీట్స్‌పై హై ఎనర్జీ డాన్స్ నంబర్ షూట్ చేశారు. ఇక పవన్ పోర్షన్ అయిపోయిందని తెలుస్తుంది. రేపటితో ఆయన భాగం పూర్తి అవుతుందని తెలుస్తుంది. హీరోయిన్స్‌గా శ్రీలీల, రాశీ ఖన్నా ఫ్రెష్ పెయిరింగ్‌తో మెరుస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు రామ్-లక్ష్మణ్ చేస్తున్నారు. 2026లో గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

