Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు (జనవరి 3న) జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టును సందర్శించనున్నారు. శనివారం ఉదయం హెలికాప్టర్ ద్వారా జగిత్యాల చేరుకోనున్న ఆయన, అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం భక్తుల వసతి కోసం రూ. 33 కోట్ల టీటీడీ నిధులతో నిర్మించనున్న 96 గదుల సత్రానికి పవన్ కళ్యాణ్ స్వయంగా శంఖుస్థాపన చేయనున్నారు. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల ఇబ్బందులను గమనించిన ఆయన, ఈ ప్రాజెక్టును పట్టుదలతో పట్టాలెక్కించారు.
Also Read: Kavitha: కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు
పవన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. జేఎన్‌టీయూ (JNTU) గ్రౌండ్‌లో హెలిప్యాడ్‌ను సిద్ధం చేయగా, సుమారు 1100 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆలయ దర్శనం మరియు భూమి పూజ తర్వాత, బృందావన్ రిసార్ట్‌లో నిర్వహించే సమావేశంలో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కొండగట్టును ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దాలన్నది ఆయన ప్రధాన లక్ష్యం.
