Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ గత నాలుగు రోజులుగా తీవ్రమైన వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలోనే ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ, జ్వర తీవ్రత తగ్గకపోవడంతో పాటు దగ్గు కూడా ఎక్కువై ఆయనకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనల మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన మంగళగిరి నుంచి హైదరాబాద్ మెరుగైన వైద్యపరీక్షల కోసం వచ్చారు.
గవర్నర్ పరామర్శ
పవన్‌కల్యాణ్ అనారోగ్యం గురించి తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ ‘ఎక్స్’ వేదికగా సందేశం ఇచ్చారు.
సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
డిప్యూటీ సీఎం ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. పవన్‌కల్యాణ్ త్వరగా కోలుకుని ప్రజలకు మరింత సేవ చేయాలని కోరారు. ఇటీవలే ప్రేక్షకాదరణ పొందిన ఆయన చిత్రం ‘ఓజీ’ విజయాన్ని పవన్ స్వయంగా అభిమానులతో కలిసి ఆస్వాదించాలి అని ఆశాభావం వ్యక్తం చేశారు.
Wishing Hon’ble Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu, a full and speedy recovery. May he return in good health to continue serving the people of Andhra Pradesh, and to enjoy the well-earned success of OG, which is receiving widespread appreciation. @PawanKalyan https://t.co/OmymLvnBib
— N Chandrababu Naidu (@ncbn) September 26, 2025
ఇది కూడా చదవండి: Crime News: బెంగళూరులో తెలుగు మహిళలపై అమానుషం
మంత్రి లోకేశ్ స్పందన
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పవన్‌కల్యాణ్ ఆరోగ్యంపై శుభాకాంక్షలు తెలిపారు. “ఆయన సేవలు రాష్ట్రానికి ప్రేరణగా నిలుస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఆరోగ్యంగా తిరిగి రావాలి. ఓజీ విజయాన్ని కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి జరుపుకోవాలి” అని ట్వీట్ చేశారు.
పవన్‌కల్యాణ్ కృతజ్ఞతలు
మరోవైపు, తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్‌లకు పవన్‌కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.