Pawan Kalyan: పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో రాజకీయ, సినీ రంగాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. ఇటీవల పహల్గం ప్రాంతంలో జరిగిన దారుణ ఘటన పట్ల పవన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ లోకల్ నుంచి నేషనల్ స్థాయిలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుత విషాద పరిస్థితుల్లో సంఘవిద్రోహులు, సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. “ఇలాంటి వారికి జైలే గతి” అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read: Fahadh Fazil: జైలర్-2లో ఫహాద్ ఫాజిల్ సంచలన ఎంట్రీ!
Pawan Kalyan: ఇదిలా ఉంటే, సినీ రంగంలోనూ పవన్ తన హవాను కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన తన సినిమాల షూటింగ్‌లో పాల్గొననున్నారు. రాజకీయ నాయకుడిగా, హీరోగా రెండు రంగాల్లోనూ పవన్ తన ప్రభావాన్ని చాటుతున్నారు.
కొల్లగొట్టినధీరో -లిరికల్ హరి హర వీర మల్లు