Hari Hara Veera Mallu: ఆంధ్రప్రదేశ్ డిఫ్యూటీ సి.ఎం.గా బిజీ ఉంటూనే ఖాళీ సమయంలో రన్నింగ్ లో ఉన్న సినిమాలు పూర్తి చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే సోమవారం నుంచి ‘హరిహరవీరమల్లు’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈ సినిమాకోసం మంగళగిరికి సమీపంలో వేసిన భారీ సెట్ లో చిత్రీకరణ జరుగుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం మేకప్ వేసుకున్న పవన్ సెట్ నుంచే సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు. బిజీ రాజకీయ షెడ్యూల్ తర్వాత ‘హరిహర వీరమల్లు’ చిత్రం కసం పెండింగ్ లో ఉన్న వర్క్ కు కొన్ని గంటలు కేటాయించానని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు పవన్ కల్యాణ్.
Hari Hara Veera Mallu: ఈ సినిమాలో పెద్దల్ని దోచి పేదలకు పంచి పెట్టే ‘రాబిన్ హుడ్’ తరహా పాత్రను సోషిస్తున్నారు. పవన్ స్టోరీని నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. క్రిష్ నుంచి దర్శకత్వ బాధ్యతలను స్వీకరించిన జ్యోతి కృష్ణ ఈ సినిమాను వీలయినంత ఫాస్ట్ గా పూర్తి చేయటానికి కృషి చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. బాబీడియోల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా మార్చి 28న ఆడియన్స్ ముందుకు రానుంది. మరి రాజకీయాల్లో తిరుగులేని విజయం సాధించిన పవన్ ‘హరిహరవీరమల్లు’లో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటారో చూడాలి.