Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారారు. ‘ఓజీ’ సినిమా విజయవంతంగా నిలవడంతో ఆయన కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో పవన్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Karuna Kumar: తల్లి చనిపోయిన విషయం దాచి.. షూటింగ్ కంప్లీట్ చేశాడు..
ఇక ఈ చిత్రం తర్వాత పవన్ రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టి, సినిమాలకు విరామం ఇవ్వబోతున్నారని టాక్ నడిచింది. కానీ తాజాగా వచ్చిన సమాచారం మాత్రం వేరేలా ఉంది. పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా అంగీకరించినట్లు, అంతేకాకుండా భారీ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లోకి మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో అడుగుపెడుతున్న KVN ప్రొడక్షన్స్ అనే సంస్థ, పవన్ కళ్యాణ్‌కి రూ.20 కోట్ల భారీ అడ్వాన్స్ చెల్లించినట్లు సమాచారం. ఈ బ్యానర్‌లో సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ టాక్. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరో మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత వచ్చే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ అభిమానులు ఈ వార్తతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ అప్‌డేట్ నిజమైతే, టాలీవుడ్‌లో మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ రాబోతుందనడంలో సందేహం లేదు.

