Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో పొలిటికల్ పంచ్‌లు!

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హై-వోల్టేజ్ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘హరిహర వీరమల్లు’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు జ్యోతికృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను ఇటీవల పవన్ పూర్తి చేశారు. తాజాగా, ఈ సినిమా నుంచి సంచలన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. సినిమాలో పవన్ నోటి నుంచి పొలిటికల్ పంచ్‌లతో కూడిన పవర్‌ఫుల్ డైలాగులు వినిపించనున్నాయట. ముఖ్యంగా, ‘‘డబ్బుల కోసం.. పదవుల కోసం నమ్మిన ధర్మాన్ని మార్చుకునే మనిషిని కాను’’ అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకోనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ డైలాగ్ పవన్ రియల్ లైఫ్ సిద్ధాంతాలకు దగ్గరగా ఉండటం విశేషం. మేకర్స్ ఈ డైలాగ్‌ను సినిమా హైలైట్‌గా భావిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Trisha: పెళ్ళికి రెడీ అయిన త్రిష?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *