pawan kalyan

Pawan Kalyan: నేటి నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌క్షిణాది యాత్ర

Pawan Kalyan: జ‌న‌సేన అధినేత‌, ఎన్డీయే కూట‌మిలోని కీల‌క నేత‌గా ఎదిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌క్షిణాది రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు శ్రీకారం చుట్టారు. తొలుత ఈ రోజు (ఫిబ్ర‌వ‌రి 12) నుంచి మూడు రోజుల‌పాటు ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాలను ప‌వ‌న్ క‌ల్యాణ్ సంద‌ర్శిస్తారు. స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణలో భాగంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. హైందర ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌క్షిణాది ప్ర‌ముఖ ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌నున్నారు.

Pawan Kalyan: ఈ నెల (ఫిబ్ర‌వ‌రి) 12, 13, 14 తేదీల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌క్షిణాది ప‌ర్య‌ట‌నలు కొన‌సాగుతాయి. ఈ మేర‌కు బుధ‌వారం హైద‌రాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ద‌క్షిణాది రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. ముందుగా కొచ్చికి వెళ్ల‌నున్నారు. అదే విధంగా ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోని ఆల‌య‌ల‌ను సంద‌ర్శిస్తారు. ముఖ్యంగా అనంత‌ప‌ద్మ‌నాభ‌స్వామి, తిరుత్తీ సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి, మ‌ధుర మీనాక్షి, శ్రీప‌ర‌మ రామ‌స్వామి, అగస్త్య జీవ‌స‌మాధి, కుంభేశ్వ‌ర దేవాల‌యం, స్వామిమ‌లై ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తార‌ని తెలిసింది.

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌త కొంత‌కాలంగా స‌నాత‌న ధ‌ర్మ‌ప‌రిక్ష‌ణ‌కు అనుకూల వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. తిరుప‌తి ల‌డ్డూ వివాదంలో, తొక్కిస‌లాట స‌మ‌యంలో ప‌వ‌న్ ఓ రేంజిలో విరుచుకుప‌డ్డారు. తొక్కిస‌లాట విష‌యంలో ఏకంగా భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. హైంద‌ర ధ‌ర్మం విష‌యంలో వెన‌క్కి త‌గ్గబోన‌నే విష‌యాన్ని ఆయ‌న వ్య‌వ‌హార శైలియే చెప్తున్న‌ది. హైంద‌వ‌ ధ‌ర్మం విష‌యంలో ఎక్క‌డ అన్యాయం జ‌రిగినా ఆయ‌న ఇలా స్పందిస్తూ వ‌స్తున్నారు.

Pawan Kalyan: అయితే ఆయా ఆల‌యాల్లో మొక్కుల‌ను తీర్చుకునేందుకు వెళ్తున్న‌ట్టు స‌న్నిహితులు చెప్తున్నా, ఎన్డీయే కూట‌మి భాగ‌స్వామి నేత‌గా బీజేపీ ద‌క్షిణాది రాష్ట్రాల కీల‌క బాధ్య‌త‌లు ప‌వ‌న్‌కు అప్ప‌గించ‌నున్న‌ట్టు తెలిసింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో అమిత‌మైన జ‌నాద‌ర‌ణ క‌లిగిన సినీ న‌టుడిగా ఆయ‌న‌కు గుర్తింపు ఉన్న‌ది. మెగాస్టార్ చిరంజివి ఛ‌రిస్మా కూడా ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆయ‌న దూకుడుకు దోహ‌దం చేయ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో బీజేపీ వ్యూహాత్మ‌క నిర్ణ‌యంతోనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ద‌క్షిణాది రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళ్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *