Pawan Kalyan: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని బైసరాన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడికి నిరసనగా జనసేన కార్యాలయాలపై పార్టీ జెండాను సగం వరకు అవనతం చేయనున్నట్టు పవన్‌కల్యాణ్ ప్రకటించారు.
Pawan Kalyan: ఈ పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అక్కడి ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఈ ఉగ్రదాడి మృతులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సంతాప దినాలను పాటించనున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.
Pawan Kalyan: అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించి ఉగ్రదాడుల మృతులకు సంతాపం తెలపాలని పవన్‌కల్యాణ్ ఆప్రకటనలో పిలుపునిచ్చారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తగా మానవహారాలు ఏర్పాటు చేయాలని, ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు.