Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రచార ఘట్టంలోకి వచ్చింది. నిన్న (మంగళవారం నాటితో) నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రచారం షురూ అయింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ కూడా తన బలాన్ని చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. ఈ మేరకు యూత్‌లో క్రేజీ ఉన్న జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో ప్రచార సభలు నిర్వహించాలని నిర్ణయించింది.
Pawan Kalyan: వాస్తవంగా ఎన్నికల ప్రకటనకు ముందు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన ఓ ప్రకటన చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, ఏ పార్టీ పొత్తు అవసరం లేదని తేల్చి చెప్పారు. టీడీపీ, జనసేన పార్టీకి ఆంధ్రా పార్టీలు అన్న ముద్ర ఉండటంతో బీజేపీకి ఉన్న మైనస్ అవుతుందేమేనని మొదట భావించారు. కానీ, కేంద్ర అధిష్ఠానం ఆదేశాలో, రాష్ట్ర కీలక నేతల సూచనో కానీ, బీజేపీ రాష్ట్ర కమిటీ మనసు మార్చుకున్నట్టు తెలుస్తున్నది.
Pawan Kalyan: ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బలం ఉన్న చోట్ల జనసేన పార్టీ కూడా పోటీకి దిగింది. దీంతో ఇటు జనసేన, అటు బీజేపీ కోసం పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఈ నెల (ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బీజేపీ, జనసేన సభల్లో పాల్గొనాల్సిందిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పవన్ కల్యాణ్‌ను కోరింది. ఈ మేరకు ఆయన కూడా సుముఖంగా అంగీకరించినట్టు తెలుస్తున్నది.
Pawan Kalyan: ఇదే దశలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ను తెలంగాణ బీజేపీ మద్దతు కోరే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీకి తెలంగాణ టీడీపీ మద్దతు ఇస్తే బలం పెరుగుతుందని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ టీడీపీ కూడా మద్దతు ఇస్తే బీజేపీకి లాభం అవుతుందా? నస్టం జరుగుతుందా? అనేది చూడాలి.
