OG

OG: మేము ముందు పవన్ ఫ్యాన్స్.. తర్వాతే హీరోలం.. థియేటర్ లో రచ్చ చేసిన మెగా హీరోలు

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ విడుదలైన దగ్గర నుంచి బాక్సాఫీస్‌ వద్ద పండగ వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి ప్రీమియర్ షోలతోనే ఈ సినిమా హంగామా మొదలైంది. పవన్ ఎంట్రీ నుంచి చివరి వరకు ప్రేక్షకులు థియేటర్లలో కేరింతలతో ఊగిపోతున్నారు. ఈ ఉత్సాహంలో సాధారణ అభిమానులే కాదు, సినీ ప్రముఖులు కూడా కలిసిపోయారు.

హైదరాబాద్ శ్రీరాములు థియేటర్‌లో జరిగిన ప్రీమియర్ షోలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. మామయ్య సినిమాను చూడటానికి వచ్చిన ఈ ఇద్దరు హీరోలు సాధారణ అభిమానుల మధ్య కూర్చొని, పవన్ ఎంట్రీ సీన్లలో పేపర్లు ఎగరేస్తూ, కేరింతలు కొడుతూ మాస్ ఫ్యాన్స్‌లా ఫుల్ ఎంజాయ్ చేశారు. హీరోలుగా కాకుండా, పవన్ అభిమానులుగా మారి చేసిన ఈ సందడి అందరినీ ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి: Nagarjuna Akkinnei: మార్ఫింగ్‌ వీడియోలతో గౌరవానికి భంగం.. హైకోర్టును ఆశ్రయించిన హీరో నాగార్జున

ఈ ప్రీమియర్ షోకి ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కూడా హాజరుకావడం విశేషం. ప్రస్తుతం వరుణ్, సాయి ధరమ్ చేసిన మాస్ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన హీరోలతో కలిసి సినిమా చూసే అవకాశం దొరకడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నారు.

ఇక సినిమాపై వస్తున్న టాక్ కూడా అద్భుతంగానే ఉంది. దర్శకుడు సుజీత్ టేకింగ్, సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి. ముఖ్యంగా పవన్ ఎంట్రీ, డైలాగ్స్ థియేటర్లలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

సినీ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ‘ఓజీ’ తొలి రోజే వంద కోట్ల వరకు వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. పండగ సెలవులు కూడా తోడవడంతో, ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *