Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలపై కొత్త అప్డేట్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది అభిమానులకు రెండు చిత్రాలతో వినోదాన్ని పంచారు. ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాల ద్వారా ఆయన తన స్టైల్‌, యాక్షన్‌ మయమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక ఇటీవల సోషల్ మీడియాలో పవన్ కొత్త సినిమాలు సైన్ చేశారనే వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. కొందరు ప్రముఖ దర్శకులతో కలిసి ఆయన ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నారని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలాంటి కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రాజకీయ బాధ్యతల కారణంగా ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు.

Also Read: Meesala Pilla Song: ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ రిలీజ్.. చిరంజీవి స్టైల్, నయనతార అందాలు!

డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ మళ్లీ సినిమాలు చేస్తారా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. అయితే, ఇప్పటికే క‌మిట్‌ అయిన చిత్రాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ తర్వాతే ఆయన భవిష్యత్‌ సినీ ప్రణాళికలపై స్పష్టత రానుంది.

ఇక ఆయన తాజా బ్లాక్‌బస్టర్‌ ‘ఓజీ’ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్లి, రూ.200 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డు సృష్టించింది. ‘హరిహర వీరమల్లు’ మిశ్రమ స్పందన పొందినప్పటికీ, ‘ఓజీ’ విజయం పవన్ అభిమానుల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాజకీయ రంగంలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నప్పటికీ, సినీ అభిమానులు ఆయనను మళ్లీ పెద్ద తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *