Pawan Kalyan: ఆపరేషన్ సిందూర్‌ను ఉగ్రవాదంపై భారత్ సాధించిన ఘన విజయంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొనియాడారు. దేశ భద్రత విషయంలో సోషల్ మీడియాలో ఎవరైనా వివాదాస్పద పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్‌లు అవగాహన లేకుండా మాట్లాడితే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. “ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం తప్పదు. ఇది దేశ గౌరవ ప్రశ్న,” అని పవన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాక, సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో దేశ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ విభాగానికి పవన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. “పాక్ ఉగ్రవాదులకు ఇది హెచ్చరిక. భారత్ సహనాన్ని పరీక్షించొద్దు,” అని ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలతో పవన్ మరోసారి దేశభక్తిని చాటుకున్నారు.
JanaSena Chief, Deputy CM Sri @PawanKalyan appeals to the Civilians#OperationSindoor pic.twitter.com/HHr3itJaZZ
— JanaSena Party (@JanaSenaParty) May 7, 2025