Pawan Kalyan: భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. విభజన అనంతరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఏటా ముత్యాల తలంబ్రాలను సమర్పించే సంప్రదాయం ఉన్నది. ఈ సారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్‌కల్యాన్ ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు.
Pawan Kalyan: భద్రాచలంలో శ్రీరామనవమి పర్యదినాన్ని పురస్కరించుకొని సీతారామల కల్యాణ మహోత్సవం ఏప్రిల్ 6న జరగనున్నది. ఈ వేడుకల కోసం పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి కారులో ఖమ్మం జిల్లా కేంద్రం మీదుగా భద్రాచలం చేరుకోనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో జడ్ ప్లస్ సెక్యూరిటీతో భారీ భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.