Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు. అయితే అన్నీ అనుకూలంగా జరిగి ఉంటే ఈ పాటికే ఈ సినిమా ఎప్పుడో విడుదల అయ్యి ఉండాలి. కానీ ఇప్పుడు వరకు రిలీజ్ కి రాలేదు.
Also Read: Champion Glimpse: శ్రీకాంత్ తనయుడి ‘ఛాంపియన్’ గ్లింప్స్ విడుదల!
తరువాత ఈ సినిమాని మార్చ్ 28న కూడా డేట్ లాక్ చేశారు కానీ ఇప్పుడు కూడా వాయిదా పడినట్లు మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా కొత్త డేట్ ని తాజాగా మేకర్స్ అందించారు. దీనితో ఈ సినిమా అనుకున్నట్లుగానే మే 9న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ సాలిడ్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. పవన్ ఫ్యాన్స్ సినిమా చూడాలంటే ఇక అప్పుడు వరకు ఆగాల్సిందే.