Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మూడో పాట సంచలనం.. పవర్‌ఫుల్ విజువల్స్‌తో గూస్‌బంప్స్!

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ నటిస్తున్న లాంగ్ అవైటెడ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజ జీవిత యోధుడు వీరమల్లు కథ ఆధారంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ డ్రామా విడుదలకు సిద్ధమవుతోంది. మేకర్స్ ఇప్పటికే జోరుగా ప్రమోషన్స్ ప్రారంభించగా, రెండు పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన మూడో పాట ‘అసుర హననం’ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. కీరవాణి స్వరాలు, రాంబాబు గోసల సాహిత్యం కలగలిసిన ఈ పాట అత్యంత పవర్‌ఫుల్‌గా ఉంది. ప్లే బ్యాక్ సింగర్స్ గళంతో ఒళ్ళు జలదరించేలా ఉందని అభిమానులు అంటున్నారు. లిరికల్ వీడియోలో పవన్ కళ్యాణ్ పోరాట సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. రెండు సాఫ్ట్ సాంగ్స్ తర్వాత ఈ డైనమిక్ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచింది. జూన్ 13న పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. పవన్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *