Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వినగానే హోరెత్తే ఎనర్జీ.. ఓ రేంజ్‌లో పూజించే అభిమానులు.. అది ఒక మామూలు క్రేజ్ కాదు, అది ఒక దేవుడిపై ఉన్న భక్తిలాంటి ప్రేమ. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చినా, పవన్ పై అభిమానుల ప్రేమ మాత్రం కొంచం కూడా తగ్గలేదు.
ఇప్పుడు ఆ ప్రేమ ఎలా వ్యక్తమైందంటే.. ఒక అభిమాని తన రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని వేయడంతో వార్తల్లో హాట్ టాపిక్ అయిపోయింది!
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకట హరిచరణ్ చిన్ననాటి నుంచే పవన్ కళ్యాణ్ వీరాభిమాని. పవన్ తన ఏరియాలోకి వస్తున్నారన్న వార్త తెలిసిన వెంటనే.. ఆయనని కలవాలి అని అనుకున్నారు.. కానీ ఉత్తి చేతులతో కలవకూడదు అని అనుకున్నాడు. ఇంకేం.. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా చేసిన రక్తదానం చేశాడు. అపుడు కొంత రక్తం తీసుకోని పవన్ కళ్యాణ్ బొమ్మను గీసేశాడు!
ఇది కూడా చదవండి: Jr.NTR: ‘అదుర్స్ 2’ అందుకే చేయట్లేదు.. ‘దేవర 2’ కచ్చితంగా ఉంటుంది.. ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్..
ఈ చిత్రం చూస్తే ఎంతగా పవన్‌ను పూజిస్తాడో అర్థమవుతుంది. ఇది సామాన్యమైన అభిమానం కాదు.. ఇది ఒక ఉదాత్తమైన నమ్మకం, ఒక జీవితంలో ఓ హీరోకి ఇచ్చే గౌరవం.
అయితే, పవన్ ఎగ్జిబిషన్‌కు రావాల్సి ఉన్నా చివరి నిమిషంలో పర్యటన రద్దయ్యింది. దీంతో హరిచరణ్ కాస్త నిరుత్సాహపడ్డాడు కానీ చేతుల్లో ఉన్న బహుమతి మంత్రి కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఎమ్మెల్యే ఆదిరెడ్డికి అందజేశారు. ఈ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ సైతం హరిచరణ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇదేంటి, రక్తంతో చిత్రమా? అని ఆశ్చర్యపోయే వారు ఉన్నా, అభిమాని ప్రేమ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ సంఘటన నిరూపించింది. ఇక పవన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నా, త్వరలోనే “హరిహర వీరమల్లు”, “ఓజీ”, “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాలతో వెండితెరపై మళ్లీ సందడి చేయబోతున్నారు. వివాదాలు ఏవైనా ఉన్నా, అభిమానుల ప్రేమ మాత్రం ఎప్పటికీ పవన్ కళ్యాణ్‌తో ఉంటుంది.