Pawan Kalyan: భీమవరం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పేకాట, కోడి పందాలకు అనధికార అనుమతులు ఇచ్చినట్లు వచ్చిన ఫిర్యాదులు ఆయన దృష్టికి చేరాయి. అంతేకాక, సివిల్ వివాదాల్లోనూ డీఎస్పీ జోక్యం చేసుకోవడమే పవన్ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది.
కూటమి నేతల్లో కొందరికి అనుకూలంగా, మరికొందరికి వ్యతిరేకంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంపై స్థానిక నేతలు డీఎస్పీ తీరును పవన్ దృష్టికి తీసుకెళ్లగా, డిప్యూటీ సీఎం వెంటనే డీజీపీని సంప్రదించి నివేదిక కోరినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, భీమవరం డీఎస్పీ జయసూర్యపై శాఖాపరమైన విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. “డిప్యూటీ సీఎం ఆదేశాలతో విచారణ చేపట్టాం. విచారణ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతోంది” అని భీమవరం ఎస్పీ స్పష్టం చేశారు.