Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులకు సర్‌ప్రైజ్ అప్‌డేట్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఓజీతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ అందుకున్నారు. ఆయన నటిస్తున్న మరో సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పుడు తన ప్రొడక్షన్ బ్యానర్ నుంచి క్రేజీ అప్‌డేట్ రాబోతోంది. ఈ అప్డేట్ అభిమానులని ఊరిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Ranveer Singh: రణవీర్ సింగ్ సరసన.. కళ్యాణి ప్రియదర్శన్ కు బంపరాఫర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీతో, తన కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ అందుకున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే రామ్ తాళ్లూరి నిర్మాణంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి కొత్త అప్‌డేట్ రానుంది. ఈ బ్యానర్‌పై గతంలో సర్దార్ గబ్బర్ సింగ్, చల్ మోహన్ రంగ వంటి చిత్రాలు నిర్మితమయ్యాయి. తాజా అప్‌డేట్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న ఆసక్తికి సంబంధించినదిగా తెలుస్తోంది. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయన యాక్షన్ సన్నివేశాల్లో ఆ క్రమశిక్షణ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అప్‌డేట్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం గురించి ఉంటుందా? లేక అకాడమీ ప్రారంభం గురించి ఉంటుందా?లేక కొత్త సినిమా ప్రాజెక్ట్ గురించి ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ సర్‌ప్రైజ్ అప్‌డేట్ ఏమిటో తెలుసుకోవాలంటే జనవరి 7 వరకు వేచి ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *