Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్.. ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతోందని, అది వచ్చే సంక్రాంతికి విడుదల కానుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను దిల్ రాజు తన సొంత బ్యానర్ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ పై నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అవ్వడం, కొత్త రికార్డులు సెట్ అవ్వడం పక్కా అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తన గత సినిమా ‘ఓజీ’ (OG)తో ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫీవర్ నుండి ఫ్యాన్స్ ఇంకా బయటకు రాకముందే, ఆయన తదుపరి చిత్రాల పరంపర కొనసాగుతోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్నారు, ఆ తర్వాత సురేందర్ రెడ్డితో సినిమా చేయనున్నారు. ఇప్పుడు వీటి మధ్యలో అనిల్ రావిపూడితో సినిమా అనడంతో, అధికారిక ప్రకటన రాకముందే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

అనిల్ రావిపూడి సక్సెస్ ట్రాక్

2026 సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫెస్టివల్ విన్నర్‌గా నిలవడమే కాకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటున్నారు. చాలా కాలంగా మిస్ అయిన వింటేజ్ చిరంజీవిని ఈ సినిమాలో చూడటంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. మరోవైపు వెంకటేష్‌తో ‘సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం’ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. గత ఏడాది వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా దిల్ రాజు బ్యానర్‌ను నష్టాల నుండి కాపాడిందని చెప్పవచ్చు. ఇప్పుడు అనిల్ రావిపూడి.. వెంకటేష్‌తో సినిమా చేస్తారా లేక పవన్ కళ్యాణ్‌తో ముందుకు వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: Maoist: భారీ ఎన్కౌంటర్ ఆరుగురు స్పాట్..

పవన్ కళ్యాణ్‌ను ఎలా చూపిస్తారు?

వెంకటేష్, చిరంజీవిలతో కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసి అటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను, ఇటు ఫ్యాన్స్‌ను మెప్పించిన దర్శకుడు అనిల్ రావిపూడి. బాలకృష్ణతో భిన్నంగా ‘భగవంత్ కేసరి’ వంటి సినిమా తీసి నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. అందులో అమ్మాయిలు బలంగా ఉండాలనే మెసేజ్ ఇస్తూనే, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా ఎలివేషన్స్ ఇచ్చారు. అలాగే ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ వంటి సమాజానికి అవసరమైన విషయాలను బాలయ్యతో చెప్పించి మెప్పించారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కీలకమైన పొజిషన్‌లో ఉన్నారు. మరి అనిల్ రావిపూడి ఆయన కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తారో.. పవన్‌తో తన మార్కు కామెడీ సినిమా చేస్తారా లేక పవర్‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేస్తారో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *