Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్

Pawan Kalyan: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్న వేళ, ప్రజల్లో విభేదాలు రేపి అశాంతి సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఇటువంటి ప్రయత్నాల పట్ల ప్రజలు, జనసేన, కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అభ్యంతరకర ప్రకటనలతో సృష్టించే ఉచ్చులో పడకుండా, సమస్యలను చట్టబద్ధ మార్గాల్లోనే ఎదుర్కోవాలని ఆయన స్పష్టం చేశారు.

సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లను ఆశ్రయించి కొందరు కుల, మతాల మధ్య విభేదాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. గత పదేళ్లుగా ఇలాంటి కుట్రలు చూస్తూనే ఉన్నామని గుర్తుచేసి, ఆవేశానికి లోనై ఘర్షణలకు దిగితే కుట్రదారుల లక్ష్యం నెరవేరుతుందని ఆయన హెచ్చరించారు. కాబట్టి సంయమనం పాటించడం అత్యవసరమని సూచించారు.

ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనమని పవన్ పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానల్‌లో ఉద్దేశపూర్వకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయించి వాటిని ప్రచారం చేయడం వెనుక ఉన్న దుష్ట ఆలోచనను గుర్తించాలని సూచించారు. ఈ తరహా సంఘటనల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవడమే సరైన మార్గమని, తొందరపడి ఘర్షణలకు దిగితే సమస్య మరింత క్లిష్టతరం అవుతుందని విశ్లేషించారు.

ఇది కూడా చదవండి: Actress: రెండో పెళ్లికి రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్..ఎవరంటే..?

మచిలీపట్నం వివాదంపై పార్టీ అంతర్గత విచారణ జరపాలని ఇప్పటికే ఆదేశించినట్లు పవన్ తెలిపారు. ఘటనలో పాల్గొన్న వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని కూడా సూచించామని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వారితో పాటు, వారి వెనుక కుట్రలు పన్నే వారిపై కూడా భారత న్యాయ సంహిత ప్రకారం కేసులు నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

దుష్ప్రచారాలను ప్రజాస్వామ్య పద్ధతిలోనే తిప్పికొడతామని, చట్టబద్ధ మార్గాల్లోనే ముందుకు సాగుతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  CM Chandrababu: రౌడీయిజం చేస్తామంటే.. తాట తీస్తాం.. చంద్రబాబు వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *