Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డబుల్ ట్రీట్: సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా

Pawan Kalyan:  ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా రాజకీయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అటు వెండితెరపై కూడా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నారు. గతేడాది విడుదలైన ‘ఓజీ’ సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, 2025లో టాలీవుడ్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘హరి హర వీరమల్లు’తో అలరించిన ఆయన, ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితమై సినిమాలు ఆపేస్తారేమోనన్న ఆందోళనలో ఉన్న అభిమానులకు 2026 నూతన సంవత్సరం సందర్భంగా మేకర్స్ ఒక భారీ సర్ప్రైజ్ ఇచ్చారు.

స్టైలిష్ డైరెక్టర్‌గా పేరుగాంచిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సరికొత్త సినిమా రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. గతంలోనే ఈ ప్రాజెక్ట్ గురించి వార్తలు వచ్చినప్పటికీ, పవన్ రాజకీయ బాధ్యతల వల్ల ఇది ఆగిపోయిందని ప్రచారం జరిగింది. కానీ, వాటన్నింటికీ చెక్ పెడుతూ నిర్మాత రామ్ తాళ్లూరి తన కొత్త నిర్మాణ సంస్థ ‘జైత్ర రామ్ మూవీస్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీలతో కలిసి పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.

Also Read: Vishwak Sen: సైలెంట్ గా విశ్వక్ సేన్ పొలిటికల్ డ్రామా.. త్వరలో టీజర్ రిలీజ్?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, పవన్ మార్క్ మాస్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోంది. ఇదిలా ఉండగా, ‘ఓజీ 2’ చేస్తానని గతంలోనే మాట ఇచ్చిన పవన్, ఇప్పుడు సురేందర్ రెడ్డి ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టడం విశేషం. సురేందర్ రెడ్డి తన సినిమాల్లో హీరోలను అత్యంత స్టైలిష్‌గా చూపిస్తారని పేరుంది, కాబట్టి పవన్‌ను ఆయన ఏ రేంజ్‌లో చూపిస్తారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే తన సినిమా కెరీర్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ కొత్త ఏడాదిలో డబుల్ ట్రీట్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *