Vijay: విజయ్ కి, పవన్ కళ్యాణ్ కి జీవితం లో జరిగిన కొన్ని విషయాలు చూసుకుంటే కొంత సిమిలర్ గా ఉంటాయి. సినిమాల నుండి రాజకీయాలకి రావడం వంటివే కాకుండా, సినిమాల విషయంలో జరిగిన వాటిని చూసుకున్నా ఒకేలా ఉంటాయి. విజయ్ నటించిన తాజా ఇంకా చివరి సినిమా ‘జన నాయకన్’ నిన్న రాత్రి ఆన్లైన్లోకి వచ్చేసింది. సినిమాలోని ముఖ్యమైన సీన్స్ ఇంకా క్లైమాక్స్ సోషల్ మీడియాలో వచ్చేసాయి. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం స్పందించడంతో సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను తీసేశారు, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. కొన్ని గంటల తర్వాత పైరసీ సైట్లలో సినిమా మొత్తం హెచ్డీ (HD) ప్రింట్ అప్లోడ్ చేసేశారు.
విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుండి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నాడు. ఇందులో భాగంగానే జనవరిలో రిలీజ్ కావాల్సిన సినిమా ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఆన్లైన్లో సెన్సార్ కాని వెర్షన్ వచ్చేసింది. అయితే, ఒక పైరసీ సైట్ మాత్రం “సినిమా థియేటర్ రిలీజ్ తర్వాతే మేము హెచ్డీ ప్రింట్ రిలీజ్ చేస్తాం” అని అనౌన్స్ కూడా చేసింది. ప్రస్తుతం విజయ్ చుట్టూ జరుగుతున్న వివాదాల వల్లే ఈ సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నట్లు తెలిపింది.
ఇక్కడే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. పవన్ రాజకీయాల్లోకి రాకముందే అతని సినిమాలపైన పైరసీ కేటుగాళ్లు విరుచుకుపడ్డారు. 2013లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అత్తారింటికి దారేది’ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ కానుంది అనే టైమ్లో సినిమా మొత్తం ఆన్లైన్ లోకి వచ్చేసింది. వెంటనే నష్టాన్ని తగ్గించడానికి సినిమాను త్వరగా విడుదల చేశారు. కానీ విజయ్ సినిమాకి ఈ అవకాశం లేదు, ఎందుకంటే జనవరిలో విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ బోర్డు కొన్ని సీన్స్ తీసేయాలని, కొంత సినిమా కట్ చేస్తేనే విడుదలకు పర్మిషన్ ఇస్తామని చెప్పింది. అత్తారింటికి దారేది సినిమా విడుదల తర్వాత ఇండస్ట్రీ హిట్ కొట్టింది, అలాగే ‘జన నాయకన్’ కూడా హిట్ కొడుతుందా లేదా చూడాలి. తమిళనాడులో ఎలక్షన్స్ తర్వాతే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియనుంది.
