Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు, వారి సానుభూతిపరుల జాడలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోలీస్ శాఖతో పాటు పరిపాలనా శాఖలకు సూచనలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి లేఖలు రాసి పలు కీలక సూచనలు చేశారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం జాగ్రత్తలు అవసరం
ఆపరేషన్ సిందూర్ తర్వాత రాష్ట్రం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయం కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఐఎస్ ఉగ్రవాద సంబంధాలు: విజయనగరం ఘటనపై స్పందన
విజయనగరంలో ఒక యువకుడికి ఐఎస్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేసిన తర్వాత రాష్ట్ర పోలీసు వ్యవస్థ మరింత బలంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు పవన్.