సికింద్రాబాద్ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం దేవస్థానంలో జరిగిన ఉగ్రవాదం అంశంపై బీపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.అమ్మవారి విగ్రహం కూల్చడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మహాపచారం అని అన్నారు.
అమ్మవారి విగ్రహం కూల్చడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మహాపచారం అని అన్నారు. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూశానని జనసేనాని తెలిపారు. ఇటువంటి దుర్మార్గాలపై చాలా బలమైన చర్యలు అవసరమన్నారు.
అందుకే తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో చెప్పానని చెప్పారు. ఇటువంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.