Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక భారం తగ్గించి, స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పిస్తూ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకానికి శ్రీకారం చుట్టగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు కార్డు కలిగిన మహిళలు ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పావన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “మహిళల అందరి తరపున సీఎం గారికి కృతజ్ఞతలు. మాట ఇచ్చాం… నిలబెట్టుకున్నాం. ఈ పథకానికి ఏటా రూ. 2వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం” అని తెలిపారు.
ప్రభుత్వం ఈ పథకాన్ని మహిళల సాధికారత దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంటూ, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు దీని ద్వారా లబ్ధి పొందుతారని ఆశాభావం వ్యక్తం చేసింది.

