Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల తన రాజకీయ ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ గత ఐదేండ్లుగా ఎదుర్కొన్న అవమానాలను, పోరాటాన్ని, భవిష్యత్ లక్ష్యాలను వివరించారు.
అసెంబ్లీ గేటు వద్ద నుంచి 100% విజయ రహస్యం
“ఏపీ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ అవమానించారు. కానీ, మనం అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వందశాతం స్ట్రైక్ రేట్ సాధించాం,” అని పవన్ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో హింసకు లోనయ్యామని, ప్రతిపక్షాలపై తీవ్ర ఒత్తిడులు తెచ్చారని ఆయన ఆరోపించారు. తనను వైసీపీ నేతలు అన్ని రకాలుగా అవమానించారని, కానీ వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు.
భావ తీవ్రతే పోరాటానికి ప్రేరణ
పవన్ కల్యాణ్ 2019లో ఎన్నికల్లో ఓటమిని కూడా ఒక శక్తిగా మార్చుకున్నామన్నారు. “ఓటమి భయం లేకపోవడమే మన బలము. అందుకే పోటీచేశాం, ఓడినా ముందుకు సాగాం,” అని ఆయన తెలిపారు.
టీడీపీ-జనసేన సమర్థతపై విశ్వాసం
పవన్ తన పార్టీని నిలబెట్టడమే కాకుండా, టీడీపీతో కలిసి కృషి చేసి, నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టామని చెప్పారు. ఇదే సంకల్పంతో రాబోయే ఎన్నికలలో మరింత బలంగా ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయనహామీ ఇచ్చారు.